ఇక జాతకంలో కుజుడు శుభస్థానంలో వున్నాడా? లేక దోషస్థానంలో ఉన్నాడా ? అనేది ముందుగా చూసుకోవాలి. కుజదోషం వుంటే అది ఏ స్థాయిలో ఉందో ... అది తన ప్రభావాన్ని ఎప్పుడు చూపిస్తుందనే విషయాన్ని కూడా అడిగితెలుసుకోవాలి. పంచాంగం పైపైన చూసి కుజదోషం వుందని చెప్పగానే ఆడపిల్ల జీవితంపై ఆ ముద్ర వేయకూడదు. శాస్త్రం బాగా తెలిసిన వారితోనే చూపించి జాతక ఫలాన్ని నిర్ణయించవలసి వుంటుంది.నక్షత్రాలు పొంతనే వివాహానికి ముఖ్యమని జ్యోతిష్య నిపుణులు కూడా అంటున్నారు.
మరికొందరు జ్యోతిష్యులు నక్షత్ర పొంతన మాత్రమే వివాహ బంధాన్ని నిర్ణయించదంటున్నారు. కుజ దోష జాతకులను కుజదోష జాతకులకే వివాహం చేయడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి అని మరికొందరు జ్యోతిష్యులు అంటున్నారు. అందుకే స్త్రీ పురుష జాతకాలను వివాహ బంధంతో ఒక్కటి చేయడం ద్వారా కుజునికి ప్రాధాన్యత పెరుగుతుంది. వివాహ బంధంలో స్త్రీపురుషులు ఒక్కటవడం, వంశావృద్ధికి కుజుడే కారకుడు. అందుకే పెళ్లి బంధం కోసం కుజస్థానానికి జ్యోతిష్య నిపుణులు ప్రాధాన్యత ఇస్తారు.కుజగ్రహ ప్రభావం ఇరు జాతకులకు ఉంటే.. ఆ వధూవరులు సుఖభోగాలు అనుభవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.ఇక కుజ దోషం వుందని చెప్పినా విచారంలో మునిగిపోవలసిన అవసరం లేదు.
ఎందుకంటే ఈ దోషం ప్రభావం అందరికీ ఒకేలా వుండదు. అది వున్న స్థానాన్ని బట్టి తీవ్రత ... ఫలితం మారుతూ వుంటుంది.కావున అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణులను కలిసి మీకున్న సందేహాలను నివృత్తి చేసుకోండి. www.onlinepoojaservices.co
Post a Comment