చంద్రుడు మాఘ నక్షత్రాన ఉండే మాసం మాఘం...!
'మాఘం' అంటే యజ్ఞం అని అర్థం ఉంది. యజ్ఞయాగాది కార్యాలకు మాఘమాసాన్ని శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. మాఘమాస స్నానమహత్యాన్ని బ్రహ్మాండ పురాణంలో పేర్కొనబడింది. మాఘమాసంలో మాఘస్నానం, మాఘ వ్రతం అతి
మహిమాన్వితం, ఎన్నో ఉన్నట్ లోకాలను, మోక్షాన్ని కూడా ప్రసాదించగలదు మాఘమాసం అని నారద పురాణంలో చెప్పబడింది. దేవతలు తమ తమ శక్తులను, తేజస్సులను ఈ మాసంలో
జలంలో నిక్షిప్తం చేస్తారు అందుకే మాఘమాసంలో స్నానం అతి శ్రేష్ఠం అని నారద
పురాణంలో
పేర్కొనబడింది. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతో అయినా ఆరు సంవత్సరాల అఘమర్షణస్నానఫలం లభిస్తుంది అంటారు. బావి నీటి స్నానం పన్నెండేళ్ళ పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీస్నానం చాతుర్గుణం, మహానదీ స్నానం శతగుణం, గంగాస్నానంసహస్ర గుణం, త్రివేణి సంగమ స్నానం నదీశతగణ ఫలాన్ని ఇస్తాయని పురాణవచనం. సూర్యోదయానికి ముందే
స్నానం చేసి సూర్యుడు ఉదయించేలోగానే సూర్యుణ్ణి ప్రార్థించాలి.నదీ స్నానం చేసే సమయంలో నదికి అభిముఖంగా చేయాలి, ఇంట్లోని బాత్రూమ్ లలో
స్నానం చేసేట్లయితే సూర్యుడికి అభిముఖంగా చేయాలి. స్నానం చేస్తూ సూర్యుడిని ...
'యదనేక జనుర్జన్యం యజ్ జ్జానాజ్జానతః కృతం!
త్వత్తేజసా హతం చాస్తూ తత్తు పాపం సహస్రధా !!
ఈ శ్లోకాన్ని ప్రార్థించడం ద్వారా పూర్ణ మాఘమాస స్నాన ఫలితాన్ని, అనంతమైన ఇతర ఫలితాలని
ప్రసాదిస్తాడని పురాణాలలో పేర్కొనబడింది. అలాగే స్నాన సమయంలో'ప్రయాగ'ను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమను 'మహామాఘం' అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నాన, దాన, జపాలకు అనుకూలం. ఈరోజున సముద్రస్నానం మహిమాన్విత ఫలదాయకం అంటారు. మాఘమాసంలో గణపతి, విష్ణువు, శివుడు, సూర్యునారాయణుడు మొదలైన దేవతలకు పూజలు, వ్రతాలునిర్విఘ్నంగా జరుగుతూ ఉంటాయి.
Post a Comment